Karimnagar: సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్.. ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి వెలుగులు
Karimnagar: కరీంనగర్ రూరల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తొలి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.
Karimnagar: సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్.. ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి వెలుగులు
కరీంనగర్: ఇల్లులేని ప్రతిఒక్క కుటుంబానికి స్వంత ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసిందని,ఇళ్లు పూర్తయిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి పండుగను లబ్ధిదారులు ఎంతో సంతోషంగా జరుపుకున్నారని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ఖాన్ పేట్ మరియు దుబ్బపల్లి గ్రామాలలో నరేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి దీపాలు వెలిగించి టపాకాయలు పేల్చి సంబరాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి స్వంత ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంజూరు చేయడం జరిగిందని నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇది మొట్టమొదటి దీపావళి పండుగ అని లబ్ధిదారులు ఎంతో సంతోషంగా స్వంత ఇంటిలో దీపావళి పండుగ జరుపుకోవడం అందులో మేము భాగస్వాములం కావడం ఆనందంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బహదూర్ఖాన్ పేట్ మరియు దుబ్బపల్లి సర్పంచులు గుర్రం సంధ్య తిరుపతిరెడ్డి,మోతె ప్రశాంత్ రెడ్డి,ఉప సర్పంచులు తప్పట్ల రమేష్, అలువాల శ్రీకాంత్,సెక్రటరీలు మహేందర్,సుజాత,లబ్ధిదారులు బుర్ర మానస అనిల్,మోతె వెన్నెల, సిరిగిరి స్వరూప, జూబ్లీనగర్,చామన్ పల్లి సర్పంచులు కమల్ గౌడ్, బోగొండ ఐలయ్యతో పాటు వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.




