Ramagundam: ఓట్ల తొలగింపుపై రామగుండంలో కాంగ్రెస్, వామపక్షాల భారీ ర్యాలీ!

Ramagundam: ఓట్ల తొలగింపును నిరసిస్తూ రామగుండంలో కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో భారీ ర్యాలీ, ఈసీ దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 7 Oct 2026 4:47 PM IST
Ramagundam
X

Ramagundam: ఓట్ల తొలగింపుపై రామగుండంలో కాంగ్రెస్, వామపక్షాల భారీ ర్యాలీ!

రామగుండం: సర్ ప్రక్రియలో ఓటు చోరీ జరుగుతుందంటూ... ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్న ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల ఆద్వర్యంలో బుదవారం భారీ ర్యాలీ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పిసిసి ప్రధానకార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, వామపక్ష పార్టీ నాయకులు గౌతం గోవర్ధన్, వై. యాకయ్య లు పాల్గొని గోదావరిఖని చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం టి జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లారు.

అనంతరం టి జంక్షన్ వద్ద ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పిసిసి ప్రధానకార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, సిపిఐ నాయకులు గౌతం గోవర్ధన్, CPM నాయకులు వై. యాకయ్య లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని ఆరోపించారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ బీజేపీ పార్టీ వ్యతిరేక ఓట్లను తొలగించడం జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 13 కోట్ల ఓట్లను తొలగించారని వెల్లడించారు. ఓట్ల తొలగింపుతో రేపు ఆ వ్యక్తికి భారతదేశ పౌరుడిగా గుర్తింపు ఉండదని, ప్రభుత్వ పథకాలకు ఓటు ప్రామాణికంగా తీసుకుంటే ఆ వ్యక్తి పథకాలను కోల్పోయే అవకాశం ఉందన్నారు.

అందుకే ఇండియా కూటమి పార్టీలు అన్ని ఏకమై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా ఓటు చోరికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, మన హక్కు అయిన ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సీపీఐ , CPM పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM