Sircilla: భూముల రీ సర్వే పారదర్శకంగా జరగాలి: అదనపు కలెక్టర్

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తనిఖీ చేసి, రైతు సమక్షంలోనే సర్వే చేయాలని ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Oct 2026 5:20 PM IST
Sircilla
X

Sircilla: భూముల రీ సర్వే పారదర్శకంగా జరగాలి: అదనపు కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: భూముల రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులకు సూచించారు. రీ సర్వే ప్రక్రియకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

రుద్రంగి మండల కేంద్రంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను మంగళవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సేకరించే వివరాలు కచ్చితంగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

సర్వే చేయనున్న భూములకు సంబంధించి రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, వారి సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. భూముల రీ సర్వేపై రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు.

ఈ పరిశీలనలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్ పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA