Mustabad: రైతుల సమక్షంలో పారదర్శకంగా భూముల రీ సర్వే చేపట్టాలి: అదనపు కలెక్టర్ నగేష్
Mustabad: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాపూర్‌లో రోవర్ ద్వారా చేపడుతున్న భూముల రీ సర్వేను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించి ఆదేశాలిచ్చారు.
Mustabad: రైతుల సమక్షంలో పారదర్శకంగా భూముల రీ సర్వే చేపట్టాలి: అదనపు కలెక్టర్ నగేష్
రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ గ్రామంలో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్ యంత్రం ద్వారా నిర్వహిస్తున్న సర్వే తీరును పరిశీలించి, వివరాల సేకరణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు చేపడుతున్న రీ సర్వే ప్రక్రియను రైతుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహించే ముందు రైతులకు తప్పనిసరిగా సమాచారం అందించాలని, నిబంధనల ప్రకారం రోవర్ యంత్రంతో పకడ్బందీగా సర్వే చేపట్టాలని సూచించారు. భూముల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితత్వంతో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.




