Peddapalli: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.. కలెక్టర్!
Peddapalli: ప్రజావాణి అర్జీలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
Peddapalli: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.. కలెక్టర్!
Peddapalli: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాముల్తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామానికి చెందిన కే. లింగయ్య గ్రామ శివారు సర్వే నెంబర్ 92, 93 లో సర్వే కోసం కోరుతూ మే 22న దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు సర్వే కాలేదని, తన భూమిలో సర్వే చేయించి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్‌కు రాస్తూ వెంటనే సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
గోదావరిఖనికి చెందిన బి. రజిత తనకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలం ఉందని, తనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్‌కు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన రామచందర్ రెడ్డి నాలుగు సంవత్సరాలుగా బోదకాలు వ్యాధితో బాధ పడుతున్నానని, తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా డీఆర్డీఓకు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
కమాన్‌పూర్ మండలం పెంచికల్పేట్ గ్రామానికి చెందిన పి. భవాని ప్రభుత్వం పేద కుటుంబాలకు అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని, తమకు ఇప్పటివరకు ఆ పథకం లబ్ధి అందలేదని, తమ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించే గృహ జ్యోతి పథకం అమలు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓ కమాన్‌పూర్‌కు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




