Peddapalli: విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష!

Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని కమాన్‌పూర్ జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. విద్యార్థులతో కలిసి అల్పాహారం భోజనం.

SHANKAR, MANTHANI
Published on: 18 Sept 2026 12:25 PM IST
Peddapalli
X

Peddapalli: విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.

విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుపై ఏకాగ్రత సాధించేందుకు అల్పాహార కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

అల్పాహారం నాణ్యత, రుచి, పరిమాణం ఎలా ఉందని విద్యార్థులను నేరుగా అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. పాలు, రాగిజావ అందుతున్నాయా లేదా అనే వివరాలను కూడా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ సమన్వయంతో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని.. అల్పాహారంతో పాటు ప్రతిరోజూ పాలు, రాగిజావ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అల్పాహారం నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల ఆరోగ్యం, పోషణతో పాటు విద్యాభ్యాసానికి అనుకూల వాతావరణం కల్పించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI