Peddapalli: నర్సాపూర్‌లో సర్వే రికార్డుల నమోదు పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలి!
Peddapalli: భూముల రీ సర్వేలో రైతుల అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాతే ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
Peddapalli: నర్సాపూర్‌లో సర్వే రికార్డుల నమోదు పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలి!
Peddapalli: భూముల రీ సర్వే ప్రక్రియలో రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి పరిష్కరించిన తర్వాతే వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టర్ సుల్తానాబాద్ మండలం రెబ్బల్ దేవ్ పల్లి గ్రామంలో రీ సర్వేపై నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు.రెబ్బల్ దేవ్ పల్లిలో రీ సర్వే పూర్తయినందున రైతుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. భూముల విస్తీర్ణం, సరిహద్దులు, హక్కుల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతుల సమక్షంలోనే వివరాలను నిర్ధారించాలని తెలిపారు.నర్సాపూర్‌లో సర్వే పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్, రికార్డుల పరిశీలన, నమోదు పనులను వేగవంతం చేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.




