Sircilla: సీపీవో, ఇన్‌చార్జి డీపీఆర్ఓ శ్రీనివాసాచారి దంపతులకు ఘన సన్మానం!
Sircilla: రాజన్న సిరిసిల్ల సీపీవో, ఇన్‌చార్జి డీపీఆర్ఓ పీబీ శ్రీనివాసాచారి ఉద్యోగ విరమణ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆయన సేవలను కొనియాడి సత్కరించారు.
Sircilla: సీపీవో, ఇన్‌చార్జి డీపీఆర్ఓ శ్రీనివాసాచారి దంపతులకు ఘన సన్మానం!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ముఖ్య ప్రణాళిక అధికారి, ఇన్‌చార్జి డీపీఆర్ఓ పీబీ శ్రీనివాసాచారి ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఈ కార్యక్రమానికి హాజరై శ్రీనివాసాచారి సేవలను కొనియాడారు.
ముఖ్య ప్రణాళిక అధికారిగా పీబీ శ్రీనివాసాచారి దాదాపు 38 ఏళ్ల పాటు సేవలు అందించారని కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జనగణన, మహాశివరాత్రి వంటి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా నిర్వహించడంలో ఆయన కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు. ఇన్‌చార్జి డీపీఆర్ఓగా కూడా ఉత్తమ సేవలు అందించారని గుర్తు చేశారు.
ఉద్యోగ విరమణ అనంతరం సమయాన్ని కుటుంబంతో పాటు సమాజానికి కేటాయించాలని కలెక్టర్ సూచించారు. శ్రీనివాసాచారి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. అనంతరం పీబీ శ్రీనివాసాచారి దంపతులను శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగంతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




