Sircilla: పండుగ సాయన్న జయంతిలో పాల్గొన్న కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 22 Oct 2026 3:28 PM IST
Sircilla
X

Sircilla: పండుగ సాయన్న జయంతిలో పాల్గొన్న కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను కలెక్టర్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA