Sircilla: సిరిసిల్ల వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి కలెక్టర్!

Sircilla: సిరిసిల్ల వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం. క్షేత్రస్థాయిలో పరిశీలన.

KALEEM, SIRICILLA
Published on: 10 Oct 2026 10:39 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి కలెక్టర్!

Sircilla: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల భవనాలు, బాలుర, బాలికల వసతి గృహాలు, మెస్ తదితర నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలిసి వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్.. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు.

బాలికల వసతి గృహం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, కాంపౌండ్ వాల్ కూడా నిర్మించామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. బాలుర వసతి గృహం పనులను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు.

ఈ పరిశీలనలో ఆర్ అండ్ బీ ఈఈ బీమ్లా నాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA