Sircilla: వడ్ల గింజలతో సీఎం రేవంత్ చిత్రపటం: కేకే మహేందర్ రెడ్డి

Sircilla: సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి వడ్ల గింజలతో రూపొందించిన చిత్రపటంతో వినూత్న శుభాకాంక్షలు తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 9 Nov 2026 3:10 PM IST
Sircilla
X

Sircilla: వడ్ల గింజలతో సీఎం రేవంత్ చిత్రపటం: కేకే మహేందర్ రెడ్డి

Sircilla: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. వడ్ల గింజలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మరింత ధైర్యంతో ప్రజాసేవ కొనసాగిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA