Vemulawada: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ!
Vemulawada: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా 58 మంది లబ్ధిదారులకు రూ.17,49,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం పంపిణీ చేశారు.
Vemulawada: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ!
Vemulawada: ఈరోజు 58 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు, పట్టణ అధ్యక్షులు తూమ్ మధు గారు, గౌరవ కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆసరాగా నిలుస్తోందని గౌరవ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటూ అర్హులైన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన వారికి ఎల్ఓసీలను అందజేస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించడం.
వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని, ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేని కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజల ఆరోగ్యం వారి సంక్షేమమే లక్ష్యంగా బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వము ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక వరం లాంటిదని వారన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు గారు,గౌరవ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్,డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కో ఆప్షన్ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




