Jammikunta: జమ్మికుంట చెక్కుల పంపిణీలో సీఎం ఫొటో లేకపోవడంపై వివాదం!
Jammikunta: జమ్మికుంట కేవీకేలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో సీఎం ఫొటో పెట్టకపోవడంపై విమర్శలు. అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిలర్ విష్ణువర్ధన్ ఆగ్రహం.
Jammikunta: జమ్మికుంట చెక్కుల పంపిణీలో సీఎం ఫొటో లేకపోవడంపై వివాదం!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై జమ్మికుంట మున్సిపాలిటీ 11 వ కౌన్సిలర్ పోనగంటి విష్ణువర్ధన్. మార్కెట్ చైర్మన్ స్వప్న సదానందం తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటో లేకుండా కార్యక్రమంనిర్వహించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమనిఆయనవిమర్శించారుప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన జమ్మికుంట పట్టణం 31 మందికి. ఇల్లంతకుంట మండలం 20.మందికి పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అందజేశారు నిర్వహించేటప్పుడు సంబంధిత అధికారులు ప్రభుత్వ నిబంధనలు, అధికారిక విధివిధానాలను పాటించాలని విష్ణువర్ధన్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలను అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు.ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాటించాల్సిన నిబంధనలను అమలు చేయడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ పొనగంటి విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు.




