Sircilla: పద్మనగర్‌లో గణేష్ నిమజ్జన వేడుకల్లో రెండు వర్గాల ఘర్షణ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో ఘర్షణ. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు, నలుగురికి గాయాలు. కరీంనగర్‌కు క్షతగాత్రుడి తరలింపు.

KALEEM, SIRICILLA
Published on: 26 Sept 2026 9:08 AM IST
Sircilla
X

Sircilla: పద్మనగర్‌లో గణేష్ నిమజ్జన వేడుకల్లో రెండు వర్గాల ఘర్షణ!

Sircilla: సిరిసిల్ల పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పట్టణంలోని పద్మనగర్‌లో ఉన్న సిద్ధి వినాయక మండపం వద్ద నిమజ్జన వేడుకల్లో డ్యాన్సులు చేస్తుండగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి కర్రలు, ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే నాగరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు.

అసలు ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమేంటి? నిమజ్జన వేడుకల్లో ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA