Jagtial: చేయూత పెన్షన్ల జమపై హర్షం.. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం!

Jagtial: చేయూత పెన్షన్ల నిధులు జమ కావడంతో జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ANAND, JAGITYAL
Published on: 27 Nov 2026 3:07 PM IST
Jagtial
X

Jagtial: చేయూత పెన్షన్ల జమపై హర్షం.. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం!

జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'చేయూత' పెన్షన్ల పథకంలో భాగంగా కొత్త లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ కావడంపై జగిత్యాలలో హర్షం వ్యక్తమైంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. దీంతో పాటు ఇందిరమ్మ చీరలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, మరియు తాజాగా రూ.5 లక్షల 'ఇందిరమ్మ కుటుంబ బీమా' పథకంతో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పెన్షన్లు అందని అర్హులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL