Metpally: మెట్‌పల్లి మున్సిపల్ సమావేశంలో తీవ్ర గందరగోళం!
Metpally: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది.
Metpally: మెట్‌పల్లి మున్సిపల్ సమావేశంలో తీవ్ర గందరగోళం!
Metpally: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం గందరగోళం మధ్య సాగింది.మున్సిపల్ చైర్మన్ లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ బీజేపీ,కాంగ్రెస్,బీఆర్ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లతో కూడిన అఖిలపక్షం నిరసనకు దిగింది. చైర్మన్ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ మొత్తం 22 మంది కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
కౌన్సిలర్ల ప్రమేయం లేకుండానే వార్డుల్లో అభివృద్ధి పనులు, మున్సిపల్ ఎజెండా అంశాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. చైర్మన్‌కు అనుకూలమైన వార్డులకే అభివృద్ధి నిధులు కేటాయిస్తూ, మిగతా వార్డులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా,జనరల్ ఫండ్ చెక్కులను విడుదల చేయవద్దని నిర్ణయం తీసుకున్నప్పటికీ, కమిషనర్,చైర్మన్ చెక్కులను విడుదల చేశారని కౌన్సిలర్లు ఆరోపించారు.ఈ వ్యవహారం కారణంగా మున్సిపల్ సిబ్బందికి జీతాలు అందని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
చైర్మన్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.ఈ పరిణామంపై వైస్ చైర్మన్ నవీన్ స్పందిస్తూ,22 మంది కౌన్సిలర్లు వాకౌట్ చేయడంతో సమావేశం రద్దయినట్లు వెల్లడించారు.




