Chandurthi: చలో కరీంనగర్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
Chandurthi: నవంబర్ 23న కరీంనగర్‌లో బండి సంజయ్ నేతృత్వంలో మహా పాదయాత్ర; బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హాజరవుతారని చందుర్తి సమావేశంలో వెల్లడి.
Chandurthi: చలో కరీంనగర్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
చందుర్తి: నవంబర్ 23న కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ చందుర్తి మండల కేంద్రంలో బిజెపి మండల కార్యవర్గ సన్నాహక సమావేశం బీజేపీ మండల అధ్యక్షులు మొకిలే విజేందర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉప అధ్యక్షులు మర్త సత్తయ్య, అల్లాడి రమేష్ గారు మాట్లాడుతూ నవంబర్ 23.న కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో నిర్వహించే మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి చందుర్తి మండలం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి మహా పాదయాత్రను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పోచేటి రాకేష్, మండల ప్రధాన కార్యదర్శులు, మర్రి మల్లేశం, పెరిక గంగరాజు, మూడపల్లి ముఖేష్, మండల కార్యదర్శిలు, బంధం తిరుమలరెడ్డి, ఎగోలపు గణేష్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు, పిసారి మంజుల, మోర్చా అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్, సాగర్,సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మోర్చాల మండల అధ్యక్షులు, జిల్లా మరియు మండల స్థాయి నాయకులు, బూత్ అధ్యక్షులు, చందుర్తి మండలంలోని 19 గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.




