Chandurthi: శ్రీ దుర్గాదేవి అమ్మవారి సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!
Chandurthi: చందుర్తి మండలం జోగాపూర్లో దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన.
Chandurthi: శ్రీ దుర్గాదేవి అమ్మవారి సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!
చందుర్తి: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గాదేవి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండపంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆది శ్రీనివాస్ అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామాలు అభివృద్ధి చెందాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.




