Chandurthi: రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడి

Chandurthi: రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడికి చందుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మొకిలే విజేందర్ పిలుపునిచ్చారు.

BABU, VEMULAWADA
Published on: 17 Oct 2026 8:49 PM IST
Chandurthi
X

Chandurthi: రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడి

చందుర్తి: చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఉప అధ్యక్షులు చిలం రాజు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ మాట్లాడుతూ.. రైతులకు సమయానికి విద్యుత్ సరఫరా కాకపోవడం, సాగునీరు అందకపోవడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించి, వారి పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, చందుర్తి మండల రైతులకు పిలుపునిచ్చారు. రైతుల పక్షాన బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

అనంతరం ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శిగా నియమితులైన పెరుక రంజిత్,కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన తీపి రెడ్డి మనోహర్ రెడ్డి, sc మోర్చా జిల్లా ఉపఅధ్యక్షులు పాటి సుదకర్, obc మోర్చా జిల్లా కార్యదర్శి బందెల వెంకటేష్, మండల ప్రధాన కార్య దర్శి గా ముడపల్లి ముకేశ్ గౌడ్,గార్లను మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పోచేటి రాకేష్,ప్రధాన కార్యదర్శి, మర్రి మల్లేశం ముఖేష్ గౌడ్, గాడి కొప్పుల జీవన్,సీనియర్ నాయకులు,పత్తిపాక శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, తోట శంకర్, దివ్య సాగర్, బోరుగాయ తిరుపతి,అజిమెరా రవి నాయక్,జెలెండర్, మర్రి రాజు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA