Karimnagar: ఛలో ఢిల్లీ: కరీంనగర్ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ బస్సు
Karimnagar: నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ ర్యాలీ కోసం కరీంనగర్ నుంచి 40 మంది కాంగ్రెస్ నేతలతో ప్రత్యేక బస్సు బయలుదేరింది.
Karimnagar: ఛలో ఢిల్లీ: కరీంనగర్ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ బస్సు
కరీంనగర్: ఏఐసీసీ పిలుపుమేరకు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఛలో ఢిల్లీ - ఓటు బచావో.. దేశ్ బచావో.. సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా నినాదంతో నవంబర్ 1న న్యూఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరగనున్న ర్యాలీలో పాల్గొనడానికి కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణం నుండి దాదాపు 40 మందితో కూడిన బస్సు ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. ఈ బస్సుకు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి బస్సును ప్రారంభించినారు.
ఈ సందర్భంగా వైద్యులు అంజన్ కుమార్ మాట్లాడుతూ ఛలో ఢిల్లీ! ఓట్ బచావో, దేశ్ బచావో!
ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరిగే గొప్ప బహిరంగ సభకు కరీంనగర్ నుంచి బయలుదేరుతున్నటువంటి కాంగ్రెస్ సైనికులు, కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది. ఈ దేశంలో గతంలో స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసినటువంటి స్వాతంత్ర్య సమరయోధులు ఏ రకంగానైతే ఈ దేశ స్వేచ్ఛ కొరకు పోరాటం చేసిండ్రో, నేడు ఓటు స్వేచ్ఛ కొరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహా బహిరంగ సభకు 'ఇండియా' కూటమికి మద్దతుగా కరీంనగర్ నుంచి మా కరీంనగర్ కాంగ్రెస్ నాయకులము అందరం ఈరోజు బై రోడ్, బస్సు ద్వారా బయలుదేరడం జరుగుతుంది.
ఈ దేశంలో జ్ఞానేష్ కుమార్ ని తొలగించే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఆనాడు సైమన్ కమిషన్ ని ఉద్యమం ద్వారా స్వతంత్ర పోరాటం ఏ విధంగానైతే లాలా లజపత్ రాయ్, భగత్ సింగ్ లు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఆనాడు స్వాతంత్్రం వచ్చింది, స్వాతంత్ర్య పోరాటం చేసిండ్రు. నేడు కూడా జ్ఞానేష్ కుమార్ 'గో బ్యాక్' కార్యక్రమం ద్వారా ఈ భారతదేశానికి ఓటు హక్కు స్వతంత్రాన్ని కల్పించాలని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అందరం విజయవంతం చేస్తామని అన్నారు.
ఢిల్లీ తరలివెళ్లిన వారిలో కాంగ్రెస్ నాయకులు అహ్మద్ అలీ, నాత శ్రీనివాస్, షాబాజ్ ఖాన్, షేక్ అజీముద్దీన్, యాకూబ్ పాషా, ఎండి. ఇమ్రాన్, ధ్యావ శ్రీనివాసరెడ్డి, మర్రి ఓదెలు యాదవ్, పంజాల స్వామి గౌడ్, కామ్ రెడ్డి రాంరెడ్డి, సాయిని తిరుపతి, మూల జైపాల్, కుంభాల రాజ్ కుమార్,
కోటోజు అశోక్, రాజేష్, శ్రీకాంత్, అరవింద్, మంద మహేష్, జి. కిరణ్ రెడ్డి, బి. ఉమాపతిరావు, వాసాల శ్రీనివాస్, కొల్లూరి కిరణ్, ఎంఏ ముజీబ్ అయూబ్, వి. శ్యామ్ సుందర్ రెడ్డి, పెద్ది కుమార్, ఏ. కౌశిక్, కే. రాజు, ఎన్. క్రాంతి, ఏ. మల్లయ్య, అందే. శంకర్, ఎన్. లింగన్న, ఎం. వెంకన్న, కరీం బాయ్, పి. వాసు గౌడ్, నార్ల సూర్య. తదితరులు ఉన్నారు.




