Karimnagar: తిమ్మాపూర్ మండలంలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి, చిత్రపటానికి నివాళులర్పించారు.
Karimnagar: తిమ్మాపూర్ మండలంలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు!
Karimnagar: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పున్నం శ్రీనివాస్ రజక సంఘం నాయకులతో కలిసి తెలంగాణ సాయుద పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించి, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ
మన తెలంగాణ వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ అని అన్నారు.భూమికోసం భుక్తి కోసం ముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తి నీ ప్రపంచానికి చాటిన చెప్పిన నిప్పు కనుకని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు పున్నం శ్రీనివాస్, ఉప సర్పంచ్ పైడిపల్లి ఆంజనేయులు, గ్రామ అధ్యక్షులు పోతుగంటి వీరేందర్, ఉపాధ్యక్షులు పైడిపల్లి స్వామి,వేల్పుల రవీందర్,మాదన రాజేందర్, కళ్యాణం శ్రీనివాస్, పైడిపల్లి మల్లేశం, అంజయ్య, రాజు, ఆంజనేయులు, శ్రీనివాస్, నరసయ్య, సంతోష్, చెలికాన్ స్వామి, అజయ్, వెంకటేష్, సాయి,శివ, అరుణ్, ఐలయ్య, సంపత్, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.




