Sircilla: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి అధికారికంగా జరపాలి
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ మైనారిటీ సెల్ అదనపు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చింది.
Sircilla: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి అధికారికంగా జరపాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ నాయకులు కోరారు. ఈ మేరకు అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవలు, విద్యారంగ అభివృద్ధికి అందించిన విశేష కృషి గురించి విద్యార్థులకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రియాజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రఫీక్, జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వేజ్, జిల్లా ఉపాధ్యక్షులు సలీం, కాంగ్రెస్ నాయకులు ఖలీం, అబ్దుల్ అఫ్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.




