Sircilla: 12వ వార్డులో రూ.6 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ!

Sircilla: సిరిసిల్ల పట్టణంలోని 12వ వార్డు ఎస్సీ కాలనీలో రూ.6 లక్షల ఎంపీ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 1:42 PM IST
Sircilla
X

Sircilla: 12వ వార్డులో రూ.6 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ!

Sircilla: సిరిసిల్ల పట్టణ అభివృద్ధిలో భాగంగా స్థానిక 12వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వార్డులోని ఎస్సీ కాలనీలో రూ.6 లక్షల నిధులతో చేపట్టనున్న పక్కా సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులకు సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్యఅతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు సహకారంతో పట్టణ అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు డి. దామోదర్ తన ఎంపీ నిధుల నుంచి దాదాపు రూ.2 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇందులో భాగంగా 12వ వార్డులోని ఎస్సీ కాలనీలో రూ.6 లక్షలతో సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు.

కాలనీలో మురికినీటి ప్రవాహ వ్యవస్థ సరిగా లేక స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారని పేర్కొన్నారు. నిధులు కేటాయించిన రాజ్యసభ సభ్యుడు డి. దామోదర్‌కు, సహకరించిన ఎమ్మెల్యే కేటీఆర్‌కు తమ తరఫున, ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రాబోయే రోజుల్లో సిరిసిల్ల పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చైర్‌పర్సన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మొగిలి నాగరాజు, బూర బాలు, పంచాయతీరాజ్ శాఖ ఏఈ అజారుద్దీన్, మాజీ కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వార్డు అధ్యక్షులు వీరగోని శ్రీనివాస్, నర్మెట ప్రభు, తిరుపతి రెడ్డి, మల్లేశం, కత్తెర రాజు, పరుషాములు తదితరులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA