Karimnagar: ప్రతి ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు
Karimnagar: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయాలని ప్రజామిత్ర ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ పిలుపునిచ్చారు.
Karimnagar: ప్రతి ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు
కరీంనగర్: ప్రతి ఆదివారం అంబేద్కర్ విగ్రహాలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా తో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ అభిమానులు అందరూ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ ఆదివారం పిలుపునిచ్చారు.
నవంబర్ 1 ఆదివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకనుండి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ పట్టణ కేంద్రంలో పూలమాల కార్యక్రమం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా తో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ అభిమానులు అందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు.
అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగమే.భారతదేశానికి,భారత దేశ వ్యవస్థలకు అందరికీ దిక్సూచి. అంబేద్కర్ పై, రాజ్యాంగం పైన జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టడానికి ఇది ఒక మహా ఉద్యమంగా తెలంగాణ రాష్ట్రంలో రూపాంతరం చెందడానికి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అంబేద్కర్ అభిమానులందరినీ ఏక దాటికి తీసుకురావడానికి కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు, క్యాదాసి ప్రభాకర్, కొంపల్లి రవీందర్, పాటకుల భూమయ్య, చిగిరి శ్రీధర్, ఎడ్ల రాంకుమార్, తాళ్ల వెంకటేష్, నీరుకుల్లా అనిల్ తదితరులు పాల్గొన్నారు.




