Sircilla: ఇల్లంతకుంట మండలంలో రెండు ఆలయాల్లో చోరీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలో లక్ష్మీ నరసింహస్వామి, ఎల్లమ్మ ఆలయాల తాళాలు పగులగొట్టి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
Sircilla: ఇల్లంతకుంట మండలంలో రెండు ఆలయాల్లో చోరీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామంలో రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.
ముస్కానిపేటకు చెందిన పెరంబదూరు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓరుగంటి కరుణాకర్ ఫోన్ చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ తాళం పగులగొట్టి ఉందని సమాచారం ఇవ్వడంతో సత్యనారాయణ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆలయ హుండీ తాళం పగులగొట్టి అందులోని సుమారు రూ.3 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
అదే విధంగా ఎల్లమ్మ ఆలయం తాళం కూడా పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ పుస్తె, రెండు వెండి కళ్లూ, వెండి మట్టే, హుండీలోని నగదును దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీకి గురైన వస్తువులు, నగదు విలువ సుమారు రూ.5 వేల వరకు ఉంటుందని తెలిపారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.




