Siricilla: బీసీల వెనుకబాటుతనానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లే కారణం బీఎస్పీ!
Siricilla: సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో బీఎస్పీ జోన్ ఇంచార్జి నిషాని రామచంద్రం విలేకరుల సమావేశం నిర్వహించి, అక్టోబర్ 9న ఆదిలాబాద్ సభ గోడపత్రికను ఆవిష్కరించారు.
Siricilla: బీసీల వెనుకబాటుతనానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లే కారణం బీఎస్పీ!
సిరిసిల్ల: బీసీల వెనుకబాటుతనానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలే కారణమని బీఎస్పీ జోన్ ఇంచార్జి అడ్వకేట్ నిషాని రామచంద్రం ఆరోపించారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ 20వ వర్ధంతిని పురస్కరించుకుని అక్టోబర్ 9న ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సంకల్ప సభ గోడపత్రికను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో తీరని అన్యాయం జరిగిందని నిషాని రామచంద్రం అన్నారు. మండల్ కమిషన్ అమలులో మాన్యవర్ కాన్షీరామ్ పోరాటం కీలకమని పేర్కొన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో బీఎస్పీ పనిచేస్తోందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీలు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఉపాధి అవకాశాల కోసం చేనేత కార్మికులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలను చట్టసభల్లోకి పంపడమే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తుందని తెలిపారు.
నెరెళ్ల ఘటనలో దళితులకు అన్యాయం జరిగిందని, అనంతరం కాంగ్రెస్, బీజేపీలు రాజకీయంగా ఉపయోగించుకున్నాయని నిషాని రామచంద్రం ఆరోపించారు. బీఎస్పీ ద్వారానే సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. అక్టోబర్ 9న ఆదిలాబాద్‌లో జరిగే బహుజన రాజ్యాధికార సంకల్ప సభకు సిరిసిల్ల జిల్లా నుంచి వేలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఈసీ సభ్యులు ఎనగందుల వెంకన్న, జోన్ ఇంచార్జి దొడ్డే సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి మహేష్, జిల్లా కార్యదర్శి కట్కూరి రమేష్, కోశాధికారి అబ్దుల్ నబీ, సిరిసిల్ల అసెంబ్లీ ఇంచార్జి బోగ కనుకయ్య, వేములవాడ అసెంబ్లీ ఇంచార్జి దొబ్బల రాము, వేములవాడ అసెంబ్లీ అధ్యక్షులు కట్కూరి శంకర్, మహిళా నాయకురాలు బూర మమత, సెక్టార్ అధ్యక్షులు బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.




