Husnabad: హుస్నాబాద్‌లో బీఎస్పీ సభ గోడపత్రిక ఆవిష్కరణ!

Husnabad: హుస్నాబాద్ అంబేద్కర్‌ చౌరస్తాలో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వర్ధంతి సభ గోడపత్రికను నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్‌ ఆవిష్కరించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 3 Oct 2026 7:07 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్‌లో బీఎస్పీ సభ గోడపత్రిక ఆవిష్కరణ!

Husnabad: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా ఈనెల 9న పటాన్‌చెరులో నిర్వహించనున్న ‘బహుజన రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభ గోడపత్రికను హుస్నాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో బహుజనుల రాజ్యాధికారం కోసం బి.ఎస్.పిరాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్‌ అధ్యక్షతన సభ జరుగుతుందని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్‌ తెలిపారు.ఈ సభకు బహుజనులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు వెలుపుల రాజు, నాయకులు మారపల్లి సుధాకర్‌, బోయిన్‌ బాబు, విక్రమ్‌, మొగిలిపాక శ్రీనివాస్‌, శ్రవణ్‌, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD