Dharmapuri: రాజభోగాలు అనుభవిస్తుందెవరో బీఆర్ఎస్ శ్రేణులకే తెలుసు: అడ్లూరి!

Dharmapuri: ధర్మపురిలో ఆదివారం జరిగిన ప్రెస్ మీట్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్‌పై విమర్శలు గుప్పించి చర్చకు సవాల్ విసిరారు.

RAMESH, DHARMPURI
Published on: 29 Nov 2026 6:06 PM IST
Dharmapuri
X

Dharmapuri: రాజభోగాలు అనుభవిస్తుందెవరో బీఆర్ఎస్ శ్రేణులకే తెలుసు: అడ్లూరి!

జగిత్యాల జిల్లా - ధర్మపురి : ధర్మపురిలోని మంత్రి అధికారిక నివాసంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నా లేకపోయినా రాజభోగాలు అనుభవిస్తుందెవరో బీఆర్ఎస్ కార్యకర్తలకే తెలుసు అని కొప్పుల ఈశ్వర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

ధర్మపురి నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగు నీరు అందించారో చూపించాలని డిమాండ్ చేశారు. సాగు నీటి అంశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జరిగిన అన్యాయంపై మేడిగడ్డ నుండి సిద్ధిపేట వరకు పాదయాత్ర చేస్తామని తెలిపారు. దానికి బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఎప్పుడు తీసుకువస్తారో తేదీ, సమయం చెప్పాలని కొప్పుల ఈశ్వర్‌కు సవాల్ విసిరారు.

కొప్పుల ఈశ్వర్ అసమర్థత వల్లే ధర్మపురి నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే సాగు నీటి విషయంలో ధర్మపురి నియోజకవర్గానికి జరిగిన అన్యాయంపై చర్చకు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్‌లను తీసుకొని రావాలని చాలెంజ్ చేశారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI