Karimnagar: అలుగునూరులో భారీ బహిరంగ సభ.. దీక్షా దివస్‌పై గంగుల కమలాకర్ సమీక్ష!
Karimnagar: అలుగునూరులో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేలా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు.
Karimnagar: అలుగునూరులో భారీ బహిరంగ సభ.. దీక్షా దివస్‌పై గంగుల కమలాకర్ సమీక్ష!
Karimnagar: ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని, జన సమీకరణ నుంచి సభా నిర్వహణ వరకు ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంటలో గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన దీక్షా దివస్ నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ప్రచార కార్యక్రమాలు, రవాణా, పార్కింగ్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కార్యాచరణ రూపొందించారు.
జన సమీకరణపై ప్రత్యేక దృష్టి...
దీక్షా దివస్ సభకు భారీ ఎత్తున మందిని సమీకరించేలా నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో సూచించారు. పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి జన సమీకరణ ప్రక్రియను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యేలా నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యక్రమాలను చేపట్టాలని చర్చించారు.
నేటి నుంచే ప్రచార హోరు.. బొట్టు, డప్పు కొట్టె కార్యక్రమాలు...
సభ జరిగే రోజు వరకు ప్రతిరోజూ ప్రజల్లోకి వెళ్లేలా ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని నాయకులకు సూచించారు. దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు బొట్టు కార్యక్రమం, డప్పు కొట్టే కార్యక్రమం, వాల్ రైటింగ్, కరపత్రాల పంపిణీ వంటి ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు దీక్షా దివస్ కార్యక్రమం గురించి వివరించేలా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు.
సోషల్ మీడియాపై ప్రత్యేక కార్యాచరణ..
ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో చర్చించారు. దీక్షా దివస్‌కు సంబంధించిన కార్యక్రమాలు, ప్రచార వివరాలు, ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం సూచించిన ఫొటోలు, ప్రచార సామగ్రినే వినియోగించాలని నాయకులకు సూచించారు. సభ జరిగే వరకు ప్రతిరోజూ చేపట్టే కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలకు సమాచారం చేరవేయాలని పేర్కొన్నారు.
కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు అనుమతుల కోసం లేఖలు..
అలుగునూరులో సభ నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా అనుమతులు కోరుతూ లేఖలు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, వాహనాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
సభకు వచ్చే వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ప్రత్యేక పార్కింగ్ స్థలాలను గుర్తించి వాహనాల నిలిపివేతకు తగిన ఏర్పాట్లు చేయాలని చర్చించారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు...
సభకు హాజరయ్యే మందికి అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయించారు. రవాణా, ట్రాఫిక్, పార్కింగ్ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులకు సూచించారు.
నాయకులకు బాధ్యతలు.. నిరంతర పర్యవేక్షణ...
సభ విజయవంతానికి పార్టీ ముఖ్య నాయకులకు జన సమీకరణ, ప్రచారం, రవాణా, పార్కింగ్, సభా ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. మండలాలు, గ్రామాల వారీగా సమన్వయకర్తలను నియమించి బాధ్యతలను పర్యవేక్షించాలని సూచించారు.
నేటి నుంచి సభ జరిగే రోజు వరకు చేపట్టే కార్యక్రమాలపై రోజువారీ సమీక్ష నిర్వహిస్తూ, అవసరమైన మార్పులు, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
పలువురు ముఖ్య నాయకుల హాజరు..
ఈ సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌తో పాటు ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితల సతీష్ కుమార్, రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి,
చల్మెడ లక్ష్మీనరసింహారావు, జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావు,తోట ఆగయ్య, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు తుల ఉమ, దావ వసంత, న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి రఘువీర్ సింగ్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ లు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




