Sircilla: చంద్రంపేట్ బైపాస్‌లో వరుస ప్రమాదాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట్ బైపాస్ జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 23 Nov 2026 11:02 AM IST
Sircilla
X

Sircilla: చంద్రంపేట్ బైపాస్‌లో వరుస ప్రమాదాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని చంద్రంపేట్ బైపాస్ జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. పదో వార్డు కౌన్సిలర్ బొలగం నాగరాజు, కొలనూరు సర్పంచ్ అరవిందరావు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఈ జంక్షన్ వద్ద జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు వికలాంగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదాల నివారణకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చంద్రంపేట్ బైపాస్ జంక్షన్ వద్ద తగిన రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో మాజీ ఎంపీపీ చంద్ర గౌడ్, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు వీరగోని శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గుగ్గిల అజయ్, బీజేపీ నాయకులు పసల ఎల్లయ్య, సుల్తాన్ బాలరాజుతో పాటు స్థానిక ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA