Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూముల బదిలీపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.
Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి!
Sircilla: సిరిసిల్ల జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయ్యాయని, అందులో 2,400 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పందించారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో తోట ఆగయ్య మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు బదిలీ అయ్యాయని, అందులో 2,400 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో పేర్కొన్నారని తెలిపారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే.. 8 వేల ఎకరాలకు సంబంధించిన గ్రామాల వివరాలు, సర్వే నంబర్లు, భూములు ఎవరికి బదిలీ అయ్యాయి, 2,400 ఎకరాల్లో ఎక్కడెక్కడ భూములను స్వాధీనం చేసుకున్నారనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని తోట ఆగయ్య కోరారు.
ఈ అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనలోగా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు. వివరాలు వెల్లడించకపోతే సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.




