Peddapalli: అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన దాసరి మనోహర్ రెడ్డికి స్వాగతం!
Peddapalli: అమెరికా పర్యటన ముగించుకుని పెద్దపల్లికి చేరుకున్న బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దాసరి మనోహర్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
Peddapalli: అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన దాసరి మనోహర్ రెడ్డికి స్వాగతం!
Peddapalli: అమెరికా పర్యటన ముగించుకుని పెద్దపల్లికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దాసరి మనోహర్ రెడ్డికి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి బస్టాండ్‌కు చేరుకున్న దాసరి మనోహర్ రెడ్డికి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించారు.
పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దాసరి మనోహర్ రెడ్డి కూడలి వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమెరికా పర్యటన ముగించుకుని పెద్దపల్లికి వచ్చిన తమ నాయకుడికి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బస్టాండ్ పరిసరాల్లో సందడి నెలకొంది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దాసరి మనోహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




