Thimmapur: పోలంపల్లి గట్టుదుద్దెనపల్లి రోడ్డును వెంటనే నిర్మించాలి బీఆర్ఎస్!

Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి నుండి గట్టుదుద్దెనపల్లి వరకు గుంతలమయమైన రోడ్డుకు మోక్షం కల్పించాలని ప్రజావాణిలో బీఆర్ఎస్ వినతి.

ANJANEYULU, MANAKONDURU
Published on: 12 Oct 2026 4:56 PM IST
Thimmapur
X

Thimmapur: పోలంపల్లి గట్టుదుద్దెనపల్లి రోడ్డును వెంటనే నిర్మించాలి బీఆర్ఎస్!

Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామం నుండి గట్టుదుద్దెనపల్లి వరకు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రోడ్డు మొత్తం గుంతలమయం అయిందని దానితో పోలంపల్లి, నర్సింగాపూర్ రెండు గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. అధికారులు ,స్థానిక ఎమ్మెల్యే స్పందించి వెంటనే కొత్త రోడ్డును నిర్మాణం చేయాలని తిమ్మాపూర్ మండల ప్రజావాణి లో అధికారులకు BRS పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా పోలంపల్లి BRS గ్రామశాఖ అధ్యక్షులు కమ్మం కృష్ణ మాట్లాడుతూ వరంగల్ జాతీయ రహదారికి భారీ వాహనాలతో మట్టిని తరలించి రోడ్డును పూర్తిగా ధ్వంసం చేసిన DBL కంపెనీ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

వచ్చేది వరికోతల సీజన్ కాబట్టి రైతులందరు ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా ఇదే రోడ్డు గుండా మిల్లులకు తరలిస్తారని రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నెల రోజుల లోపు రోడ్డు పనులను ప్రారంభించాలని లేని యెడల ప్రజలందరిని కలుపుకొని రోడ్డు కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU