Kamanpur: కమాన్పూర్లో వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి!
Kamanpur: కమాన్పూర్ మండలంలో వరి కోతలు ప్రారంభమైనందున రైతుల సౌకర్యార్థం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Kamanpur: కమాన్పూర్లో వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి!
Kamanpur: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల పరిధిలో వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతుల సౌకర్యార్థం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తహసీల్దార్ వాసంతికి, ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వంశీకృష్ణకు వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మండలంలో వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు మధ్య దళారులను ఆశ్రయించి తక్కువ ధరలకు ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సెర్ఫ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఆధ్వర్యంలో మండలంలోని అన్ని అవసరమైన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు తాటికొండ శంకర్, నాయకులు గుర్రం లక్ష్మీమల్లు, కొండ వెంకటేష్, చిందం తిరుపతి, రాచకొండ రవి, నీలం శ్రీనివాస్, జాబు సతీష్, తోట రాజ్ కుమార్, రాచకొండ చంద్రమౌళి, పెండ్లి నారాయణ, పొట్ల సతీష్, కొయ్యడ సంపత్, పంతకాని రవి, నడిగొట్టు సంపత్, పొట్ల శంకర్, కొండిల్ల ఓదెలు, గుర్రం శంకర్, ఒడ్నాల సతీష్, షేక్ మొహినుద్దీన్, దండే రమేష్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.




