Peddapalli: చిన్న వయసులోనే సేవా గుణం నేర్పించడం అభినందనీయం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథనిలో కానిస్టేబుల్ కుమారుని 5వ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సీఐ బుద్దే స్వామి ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
Peddapalli: చిన్న వయసులోనే సేవా గుణం నేర్పించడం అభినందనీయం!
Peddapalli: Manthani చిన్న వయసులోనే చిన్నారికి సేవా గుణాన్ని నేర్పించడం అభినందనీయమని మంథని సీఐ బుద్దే స్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన తాటి విజయకుమారస్వామి (పోలీస్ కానిస్టేబుల్ విజయ్) కుమారుడు చిన్నారి తాటి సాయివర్ధన్ 5వ పుట్టినరోజు సందర్భంగా శనివారం మంథని సీఐ కార్యాలయంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన 5 నిరుపేద కుటుంబాలకు 9 రకాల నిత్యవసర వస్తువులతో కూడిన కిట్లను సీఐ బుద్దే స్వామి, ఎస్ఐ సందీప్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుకలను ఆడంబరంగా కాకుండా పేదలకు సాయం చేస్తూ జరుపుకోవడం సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. తండ్రి విజయకుమారస్వామి మాట్లాడుతూ కేవలం కేక్ కట్ చేయడమే కాకుండా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని చిన్నప్పటి నుండే నేర్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.




