Yellareddypet: ఏఎంసీ డైరెక్టర్ ఇమామ్ భాయ్‌కు కాంగ్రెస్ నాయకుల సన్మానం

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బొప్పాపూర్ ఏఎంసీ డైరెక్టర్ ఇమామ్ భాయ్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Nov 2026 9:37 PM IST
Yellareddypet
X

Yellareddypet: ఏఎంసీ డైరెక్టర్ ఇమామ్ భాయ్‌కు కాంగ్రెస్ నాయకుల సన్మానం

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్ ఇమామ్ భాయ్‌ను ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఇమామ్ భాయ్‌కు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారి బాల్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు రఫీక్, నాయకులు కస్తూరి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA