Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరతో పాటు పలు గ్రామాల్లో బొడ్డెమ్మ వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గోలి లింగారెడ్డి పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD
Published on: 2 Oct 2026 7:15 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బొడ్డెమ్మను వివిధ రకాల పూలతో అందంగా పేర్చి ఆలయాల వద్ద ప్రతిష్ఠించి, ఆటపాటలతో భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు జరుపుకున్నారు.

కొమిర గ్రామంలో బొడ్డెమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ మహిళలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మను పూజించి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో కొమిర సర్పంచ్ గోలి లింగారెడ్డి పాల్గొని మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. బొడ్డెమ్మ తల్లి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండి రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD