Sircilla: ఎల్లారెడ్డిపేటలో మానవత్వం చాటుకున్న బ్లూ కోర్ట్ పోలీసులు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన మహిళకు బ్లూ కోర్ట్ పోలీసులు ప్రథమ చికిత్స చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 31 Oct 2026 10:39 AM IST
Sircilla
X

Sircilla: ఎల్లారెడ్డిపేటలో మానవత్వం చాటుకున్న బ్లూ కోర్ట్ పోలీసులు!

Sircilla: ఖాకీ అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు.. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడం కూడా అని నిరూపించారు ఎల్లారెడ్డిపేట బ్లూ కోర్ట్ పోలీసులు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఓ మహిళ పట్ల చూపిన మానవత్వం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ మహిళకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రోడ్డుపై కుప్పకూలిపోయింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బ్లూ కోర్ట్ పోలీసులు మహిళ పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెకు సహాయం అందిస్తూ ప్రథమ చికిత్స చేశారు. మహిళ చేతులు, కాళ్లు రాస్తూ ఆమెకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు.

పోలీసుల తక్షణ స్పందనతో కొద్దిసేపటికి ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. అనంతరం ఆమె వివరాలు తెలుసుకున్న పోలీసులు, పరిస్థితిని గమనించి ఆమెను ఇంటికి పంపించారు.

ఖాకీ దుస్తుల వెనుక దాగి ఉన్న మానవత్వానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. విధి నిర్వహణతో పాటు ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన పోలీసుల సేవాభావంపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA