Karimnagar: ఓటర్ల సవరణ (SIR)పై ప్రతిపక్షాలది విషప్రచారం: బీజేపీ నేత సునీల్ రావు!

Karimnagar: దేశంలో చేపట్టిన సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు కావాలనే విషప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు మండిపడ్డారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 11 Oct 2026 6:57 PM IST
Karimnagar
X

Karimnagar: ఓటర్ల సవరణ (SIR)పై ప్రతిపక్షాలది విషప్రచారం: బీజేపీ నేత సునీల్ రావు!

కరీంనగర్: దేశంలో 95 కోట్ల ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ ( ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తైందని... ప్రతిపక్షాలు ఎస్ఐఆర్ పై దుష్ప్రచారం చేస్తూ... ప్రజలను గందరగోళం లోకి నెట్టేస్తున్నారని బీజేపి రాష్ట అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు.

కరీంనగర్ లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో 82 కోట్ల మంది ఓటర్లు కొత్తగా వచ్చిన ఓటర్ల జాబితాలో అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని ఎన్‌రోల్మెంట్ కావడం జరిగిందన్నారు.

ఇందులో 88 శాతం వరకు పాత ఓటర్ల జాబితాలో ఉన్నవారే ఎన్‌రోల్మెంట్ పూర్తి చేసుకొని కొత్త ఓటర్ల జాబితాలోకి రావడం జరిగిందని తెలిపారు. 13 కోట్ల మంది ఓటర్లు వివిధ దశల్లో విచారణలో ఉన్నారని అన్నారు. 2 కోట్ల 89 లక్షల మంది ఓటర్లు మరణించిన ఉన్నారని... ఇందులో వీరు ఉండే అవకాశం లేదన్నారు. దాదాపు 1 కోటి 1 లక్ష మంది ఫేక్ ఓటర్లు... ఒక్కొక్కరు రెండు నుండి మూడు చోట్ల ఉన్నారని తెలిపారు.

ఇలాంటి ఓటర్లు ఇప్పటి వరకు వివిధ దశల్లో విచారణకు కూడ హాజరు కాకపోవడం, బిఎల్ఓ లకు సరైన ద్రువపత్రాలు ఇవ్వక పోవడం వల్ల అలాంటి ఓటర్లను షిప్టెడ్, ఆబ్సెంట్, డెత్ కెటగిరీ జాబితో రావడం దరిగిందని తెలిపారు.

ప్రతి రాజకీయ పార్టీ ఎస్ ఐ ఆర్ కు సంబంధించి బీఎల్ఏ లను నియమించుకొని ఎస్ఐఆర్ పరీశీలన చేసినట్లు తెలిపారు. ఇంత పకడ్బందీగా ప్రక్రియ జరిగినా చాలా ఓటర్లు గైర్హాజరై, వేరే ప్రాంతాలకు వెల్తే వీరి ఓట్లు ఎక్కడున్నాయని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫాం 6 ప్రక్రియ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని తెలిపారు.

ప్రతి సంవత్సరం ఓటర్ జాబితాలో 4 సార్లు కొత్త ఓటర్లను ఎంట్రీ చేయడం... ప్రతి సంవత్సరం 4 సార్లు ఒటర్ దరఖాస్తు చేస్తే బిఎల్ఓలు , రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఏఆర్ ఓ సమక్షంలో ఓటర్ జాబితాలో పొందుపరచడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఎవరినీ ఓటర్ జాబితాలో రాకుండ ఎవరు అడ్డుకోలేరని తెలిపారు. ఫారం 7 ద్వారా ఓటర్లను తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి... అది అవాస్తవం అన్నారు. ఫాం 7 అనేది ఓటర్ జాబితాలో ఉన్న వ్యక్తులను ఎవరైన ఆబ్జెక్షన్ చేస్తే... సంబంధిత ఓటర్ ను పరిశీలన చేసి సరైందా కాదా తెలువడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటి వరకు దేశం మొత్తం లో 95 కోట్ల ఓటర్లలో కేవలం 25 లక్షల ఓటర్లు మాత్రమే తొలగించబడ్డారని అన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తం చూస్తే కేవలం 8 వేలు మాత్రమే తొలగించబడ్డాయని తెలిపారు. ప్రతి పక్షాలు ఇన్ని అవాస్తవాలు ప్రజలకు ప్రచారం చేస్తూ... లేని పోని దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం చాలా దుర్మార్గం అన్నారు.

ఎలాంటి కారణం లేకుండానే ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్రాలు చేయడం శోచనీయం అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాధరణను ఓర్వలేక ప్రతి పక్షాలు ఎస్ఐఆర్ సాకుతో ప్రభుత్వం పై కుట్రలు చేస్తూ... బురదజల్లే ప్రయత్నం లో భాగమేనని మండి పడ్డారు. బీజేపి, ఎన్డీయే పక్షాలకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఈ SIR ప్రక్రియపై ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారని ద్వజమెత్తారు.

దేశవ్యాప్తంగా 9 లక్షల బూతులలో అన్ని రాష్ట్రాల్లో ప్రక్రియ జరిగితే...ఓట్లు తొలగించడం ఎవరికి అవసరం అన్నారు. ఎవరు ఎవరికి ఓటు వేస్తారని ఎలా గుర్తిస్తారు...? ఓట్లు తెలగించే అధికారం రాజకీయ పార్టీలకు లేదని తేల్చిచెప్పారు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాంటి ఓట్లు తొలగించే ప్రయత్నం చేసిందో తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలు చేస్తున్న కుట్రను ఖండించాలని మండి పడ్డారు.

ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేని బొద్దింకలు, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులని విమర్శించారు. 2014 ఎన్నికల నుండి మోడి గెలుస్తూ వస్తున్నారు... 2014, 2019 ఎన్నికల్లో ఎలా గెలిచారు...? అని ప్రశ్నించారు. ఓట్లు చోరీ చేసి గెలావలనుకుంటే 303 వచ్చిన సీట్లు బిజేపి కి 240 సీట్ల గ్రాఫ్ ఎలా పడిపోయిందని ప్రశ్నించారు. ఇవన్ని ప్రతి పక్షాలు చేస్తున్న కట్టు కథలని ద్వజమెత్తారు.

జిల్లాల్లో ప్రతి పక్ష పార్టీల నాయకులు ఎందుకు ఆంధోళనలు చేస్తున్నారని... ఎం అవసరం వచ్చిందని మండి పడ్డారు. మీ పార్టీల దగ్గర లిస్టు ఉంటే మా ఓటు ఎటుపొయిందనిీ అడిగిన వారు ఉంటే మీరు సబ్ మిట్ చేయాలని ఎద్దేవ చేశారు. జిల్లా కలెక్టర్ కు, అధికార యంత్రాంగం సబ్ మిట్ చెయ్యాలన్నారు గ్రామీన ప్రాంతాల్లో స్వచ్చమైన ఓటర్ జాబితా సిద్దమైందని... పట్టణాల్లొ మాత్రమే కొంత ఇబ్బందిక పరిస్థితి మాత్రమే ఉందని అన్నారు.

రెండు మూడు చోట్ల ఓటర్లగా నమోదు చేస్కోని ఉంటారు కాబట్టి... వారు ఇప్పుడు ఒకే చోట హాజరవుతారని... ఇలాంటి విషయ పరిజ్ఞానం కూడ లేకుండా ప్రజలను ఆంధోళనకు గురి చేయడం సిగ్గు చేటని ద్వజమెత్తారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నదే... ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. కేరళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీఎం రేసులో ఉన్న వ్యక్తులు, ఎస్ఐఆర్ తో లాభం చేరుకూరందని మొన్నటికి మొన్న వాఖ్యలు చేశారు తెలిపారు.

దొంగ ఓట్లతో చాలా ఇబ్బందులు ఉండేవని ఎస్ఐఆర్ మాకు హెల్ప్ చేసిందని నేటి కేరళ హోం మంత్రి లాంటి వ్యక్తులు చెబుతా ఉంటే... ఇక్కడ మాత్రం సిగ్గు లేకుండ దర్నాలు రాస్తా రోకోలు చేయడం ఎంత వరకు సమంజసం అని నిలదీసారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేరళ లో ఒక మాట... ఇరత చోట్ల ఇంకొ మాట మార్చి మాట్లడటం చాలా సిగ్గు చేటని... కాంగ్రెస్ పార్టీ నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారని ద్వజమెత్తారు.

ఊరికే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర తప్ప ఎస్ఐఆర్ లో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగలేవని... చాలా పకడ్బందీగా ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. స్వచ్చమైన ఓటర్ జాబితా తయారు చేయడమే ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. 1952, 1957,1961, 1983,1984, 1992,2002, లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందని... ప్రతి సారి ఎస్ఐఆర్ ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు.

జ్ఞానేష్ కుమార్ బీజేపికి వంతపాడారని ఆరోపిస్తున్నారు... 2025 లో జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా వచ్చారని అంతకు ముందే ఎన్నికలు జరిగాయని స్పష్టం చేశారు. ఎన్నికల కమీషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసే చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీదని ద్వజమెత్తారు. ఆనాడు సుకుమార్ సేవ్, ఆర్. కే త్రివేది, టీ. ఎన్ శేషన్, రమాదేవి, ఎంఎస్ గిల్ లాంటి ఎలక్షన్ కమీషన్లకు పదవులు ఇచ్చిన రాజకీయంగా వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. ఎస్ఐఆర్ తో లాభం జరిగిందని సర్టిఫికేట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పై రాహుల్ గాంధీ ఎందుకు చర్యలు తీస్కేవడం లేదు... అలా చెప్పిన వారి పై తప్పు అని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ ధర్నాలు చేస్తున్న కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులకు మాదొకటే ప్రశ్న....? "మీ దగ్గర మా ఓటు కోల్పోయినాము, మా ఓటు తొలగించారని ఎవరైనా వచ్చి దరఖాస్తు ఇస్తే దాన్ని బహిరంగ పరచండని సవాల్ విసిరారు. అధికారిక దరఖాస్తును కలెక్టర్ గారికి, ఎలక్షన్ అధికారులకు తీసుకెళ్లి ఫిర్యాదు చేయాలని హితువు పలికారు. ఏ ఒక్క ఓటరు కూడా వచ్చి మా ఓటు పోయిందని అడగడం లేదు.

గ్రామాల్లో 100% స్వచ్ఛమైన ఓటర్లు తయారైతే, పట్టణ ప్రాంతాల్లో చిన్నపాటి గందరగోళాలు మినహా ఎలాంటి తప్పులు జరగలేదు. భారతదేశాన్ని అస్థిరపరచడానికి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తూన్నారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం తగ్గిందని... ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్నె స్థితిలొ లేరని తెలిపారు.నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు.

ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ప్రతి పక్షాలు చేస్తున్న కుట్ర మాత్రమే అని అన్నారు. పరిశుద్దమైన జాబితా వల్లే ఎన్నికల శాతం పెరుగుతుందని అన్నారు. ఇలాంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తే... బంగ్లాదేశ్, పాకిస్థాన్, లాగా చేయాలని కుట్రలు చేస్తే ఊరుకునే ప్రస్తక్తి లేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన బుద్ది చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు తోట అనిల్, మాసం గణేష్, కొంపెల్లి రామన్, సోమిడి వేణు ప్రసాద్, పొన్నం మొండయ్య గౌడ్, కర్రే అనిల్, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బల్బీర్ సింగ్, నాయకులు పండుగ నాగరాజు, వెంకట్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN