Jangalapalli: తిరు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న కందుల సంధ్యారాణి!

Jangalapalli: ఎన్టీపీసీ జంగాలపల్లి స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ తిరు కల్యాణ మహోత్సవంలో బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 24 Nov 2026 6:06 PM IST
Jangalapalli
X

Jangalapalli: తిరు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న కందుల సంధ్యారాణి!

Jangalapalli: ఎన్టీపీసీ, జంగాలపల్లి గ్రామంలోని స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహించిన తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిలివేరు అంజి,సింధూ,ప్రశాంత్, జక్కుల పద్మ,ప్రవీణ్,కళ్యాణ్,తిరుపతి,అరవింద్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM