Sircilla: ముస్తాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం!

Sircilla: ముస్తాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం ప్రధాని మోదీ, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన క్షమాపణ చెప్పాలని డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 29 Sept 2026 6:22 PM IST
Sircilla
X

Sircilla: ముస్తాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం!

Sircilla: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హిందూ దేవుళ్లను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ముస్తాబాద్ మండల బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. మండల బీజేపీ అధ్యక్షుడు సౌళ్ళ క్రాంతి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా సౌళ్ళ క్రాంతి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి, ఒక వర్గం ఓట్ల కోసం మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విష్ణు భక్తుడని, శివుడిని పూజించరంటూ వ్యాఖ్యలు చేయడం చవకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

శివుడిని పూజించే వారంతా ద్రవిడులు, విష్ణు భక్తులంతా ఆర్యులంటూ భారతీయులను విభజించేలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మెజారిటీ హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు కేవలం రాజకీయ అంశంగా చూస్తున్నారని సౌళ్ళ క్రాంతి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మల్లారపు సంతోష్ రెడ్డి, చిట్నేని శ్రీనివాసరావు, డీటీ సత్తయ్య, గుండవేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA