Karimnagar: మోదీపై మల్లికార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. కరీంనగర్‌లో బీజేపీ నిరసన
Karimnagar: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపాయి.
Karimnagar: మోదీపై మల్లికార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. కరీంనగర్‌లో బీజేపీ నిరసన
కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్లోని తెలంగాణ చౌకలో నిరసన తెలిపిన బిజెపి నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండించిన బిజెపి శ్రేణులు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరువవుతుందని ఏదో ఒకటి చేయాలని బిజెపిపై నిరాదరణ ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని హెచ్చరించారు.
మోడీ తండ్రి పై అనుచిత వాక్యాలు చేయడం సమంజసం కాదని, దేశంలో ఏ సమస్యలు లేకపోవడంతో ఏం చేయాలో తోచక ఇలా వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని మండిపడ్డారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని లేనిపోని అప నిందలు వేస్తూ ఓటు చోరీ, అని తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులన్నారు.
తప్పుడు ఓట్లు విదేశీయులు అక్రమ చెదబాటుదారులయి మాత్రమే తొలగిస్తున్నారు తప్ప వేరే ఎవరి ఓట్లు తొలగించడం లేదని దీనిపై రాద్ధాంతం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఇది మానుకోవాలన్నారు. రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున యువతను విద్యార్థులను కూడగట్టి ఓటు తొలగింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




