Sircilla: గంభీరావుపేట పీహెచ్‌సీ ప్రారంభం కోసం బీజేపీ మహా నిరసన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నూతన పీహెచ్‌సీ ప్రారంభించాలని బీజేపీ మహా నిరసన. వారం రోజుల్లో ప్రారంభిస్తామని డీఎంహెచ్‌ఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ.

KALEEM, SIRICILLA
Published on: 7 Nov 2026 1:43 PM IST
Sircilla
X

Sircilla: గంభీరావుపేట పీహెచ్‌సీ ప్రారంభం కోసం బీజేపీ మహా నిరసన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనాన్ని వెంటనే ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మహా నిరసన చేపట్టారు.

కొత్త భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడంపై బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు నూతన పీహెచ్‌సీని వెంటనే ప్రారంభించాలని, అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాలని, అత్యవసర వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలని, 24 గంటల వైద్య సేవలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఫోన్‌లో నిరసనకారులతో మాట్లాడి వారం రోజుల్లో నూతన పీహెచ్‌సీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీంతో డీఎంహెచ్‌ఓ హామీతో బీజేపీ నాయకులు మహా నిరసన కార్యక్రమాన్ని విరమించారు.

అధికారులు ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లో పీహెచ్‌సీని ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA