Karimnagar: హిందూ పండుగలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ద్వేషం ఎందుకు!

Karimnagar: కరీంనగర్‌లో గణేశ్ నిమజ్జనానికి నీటి విడుదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 21 Sept 2026 6:59 PM IST
Karimnagar
X

Karimnagar: హిందూ పండుగలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ద్వేషం ఎందుకు!

Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించాల్సిన ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వేడుకలకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించిందని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఘాటుగా విమర్శించారు.

కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా కరీంనగర్లో జరిగే వినాయక నిమజ్జనా ఉత్సవానికి అవసరమైన నీళ్లను ప్రాజెక్టుల నుండి విడుదల చేసే విషయంలో మొండి వైఖరిని ప్రదర్శించిందని ఆయన ఆరోపించారు.

ఇటీవల కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం ఆయా ప్రాంతాలను సందర్శించి , నీటి సమస్య ను పరిష్కరించాలని అధికారులకు , రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని , అయినా కూడా నిన్నటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

హిందూ పండగల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ, వినాయక నిమజ్జనం సజావుగా జరగాలనే ఉద్దేశంతో బిజెపి ఆధ్వర్యంలో సోమవారం రోజున చింతకుంట కెనాల్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించి , రేవంత్ రెడ్డి ప్రభుత్వ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆందోళనకు దిగివచ్చి ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా కెనాల్ కు నీటిని విడుదల చేయించడం జరిగిందని , ఇది ముమ్మాటికి హిందూ ప్రజల విజయమన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిందూ పండుగల పట్ల అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. ప్రధానంగా.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, ఎల్‌ఎండీ పరిధిలోని కాలువల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సరిపడా నీటిని విడుదల చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించలేని స్థితిలో ఉందన్నారు. ఒకపక్క కాలువలన్నీ ఎండిపోయి, పొలాలు నీళ్లు లేక బీళ్లుగా మారుతున్న సమయంలో... కనీసం హిందువులందరి ఐక్యతా పర్వదినమైన గణేశ్ నిమజ్జనానికి నీళ్లు వదలకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు.

ఎస్సారెస్పీలో 40 టీఎంసీలకు పైగా నీళ్లున్నప్పటికీ నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.. రంజాన్, క్రిస్మస్ సహా ఇతర మతాల పండుగలకు నీళ్లే కాదు, వారు అడిగినన్ని నిధులిచ్చినా తాము ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని, హిందూ పండుగలకు నిధులివ్వకపోగా, కనీసం నిమజ్జనానికి నీళ్లు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానానికి నిదర్శనం అన్నారు .

"కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్" అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మాట్లాడినప్పుడే హిందువులంటే ఆ పార్టీకి ఎంత చులకన భావమో ప్రజలందరికీ అర్థమైందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక మండపాల నిర్వాహకులు భారీ ఎత్తున తరలివచ్చి చేపట్టిన 'చలో చింతకుంట' కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రజల ఆగ్రహం ముందు తలవంచిన ప్రభుత్వం ఆదరాబాదరగా ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుందన్నారు. , ఇది ముమ్మాటికి హిందూ ప్రజల విజయమేనని ప్రవీణ్ రావు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నాయకులవి సిగ్గుచేటు వ్యాఖ్యలు...

కరీంనగర్ కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని , నీటి విడుదల విషయంలో ఆ నాయకుడు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బోయిన్పల్లి ప్రవీణ్ రావు ధ్వజమెత్తారు.. 100 ఓట్లు సాధించలేని , వార్డు మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి ఈ విషయంలో కలగజేసుకొని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు నీటిని విడుదల చేస్తున్నట్టు ఆ నాయకునికి ప్రభుత్వం నుండి ఏమైనా అధికారికంగా పత్రం వచ్చిందా.

లేదా నీటిపారుదల శాఖ మంత్రి చెప్పారా అనే విషయం చెప్పకుండా రాజకీయ చేయడం సరికాదు అన్నారు. అసలు హిందూ పండుగలపై కాంగ్రెస్ నేతలకు ద్వేషం ఎందుకని నిలదీశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుడు చేస్తున్న అర్థరహిత రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు అన్నారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, మేకల వెంకటేష్, ఎన్నం ప్రకాష్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేడ్ల ప్రవీణ్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాజు అడిచెర్ల, నక్క ప్రమోద్, రవి గోపాల్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN