Karimnagar: ఓటర్ల సవరణ (SIR)పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం బీజేపీ!

Karimnagar: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై కాంగ్రెస్, ఇతర పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ఆగ్రహం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 11 Oct 2026 6:41 PM IST
Karimnagar
X

Karimnagar: ఓటర్ల సవరణ (SIR)పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం బీజేపీ!

Karimnagar: కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ( ఎస్ ఐ ఆర్ ) ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తూ విషప్రచారం చేస్తున్నాయని, ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పై గందరగోళం సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యమని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బిజెపి మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా కాంగ్రెస్ , సిజెపి ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం భారత ఎన్నికల సంఘం బిజెపి ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఓటర్ల జాబితాను పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో నకిలీ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే 'ఎస్ ఐ ఆర్' ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సర్ ఫై అనవసర రాద్ధాంతం చేయడమే లక్ష్యంగా వ్యవహారాలు చేస్తున్న కాంగ్రెస్ , సిజెపి వైఖరి పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

నకిలీ ఓట్లు , మరణించిన వారి ఓట్లు తొలగించవద్ద అని ఆయన ప్రశ్నించారు.ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఇదేమి ప్రథమం కాదని , భారత ఎన్నికల సంఘం గతంలో 1952, 1957, 1961, 1965–66, 1983–84, 1987–89, 1992–95 2002–2004 లలో ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను నిర్వహించిందని గుర్తు చేశారు.

సుదీర్ఘ విరామం తర్వాత 2025 మరియు 2026 లలో దేశవ్యాప్తంగా వివిధ దశల్లో ఈ సర్ '' సర్వేను చేపట్టిందన్నారు అయితేప్రతిపక్ష పార్టీలు ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓటు బ్యాంకు రాజకీయం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు చేపట్టిన ఈ ప్రక్రియను రాజకీయం చేయడం సరికాదన్నారు. బిజెపి ఓట్ చోరీ చేస్తుందని మాట్లాడుతున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓట్ చోరీ తోనే గెలిచి 50 ఏళ్లు దేశాన్ని పాలించిందా..? అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలను గందరగోళానికి గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలని ఏకైక ఎజెండాతో కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. పూర్తి పారదర్శకతతో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై , చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలంతా గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, సిజేపీలు ఈ విషయంలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను, వైఖరిని విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బిజెపి మండలాధ్యక్షులు చింతం శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి, ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, ఓదెలు,బుర్ర శ్రీనివాస్ గౌడ్ మధుకర్ రెడ్డి , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN