Peddapalli: రాఘవపూర్ సబ్ స్టేషన్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా!
Peddapalli: రాఘవపూర్ సబ్ స్టేషన్ ఎదుట రైతులకు నిరంతర విద్యుత్, సాగునీరు అందించాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
Peddapalli: రాఘవపూర్ సబ్ స్టేషన్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా!
Peddapalli: రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీటిని సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి మండలం రాఘవపూర్ సబ్ స్టేషన్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర, కిసాన్ మోర్చా రాష్ట్ర, జిల్లా శాఖల పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
తరచూ విద్యుత్ కోతలతో వ్యవసాయ మోటార్ల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పంటలకు సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని ముందుగానే విడుదల చేసి ఉంటే ప్రయోజనం కలిగేదని, ఆలస్యం వల్ల పంటలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కట్కూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో తూకం పేరుతో రైతులకు నష్టం జరగకుండా చూడాలని, రైస్ మిల్లులపై అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారని తెలిపారు. విద్యుత్, సాగునీరు, కొనుగోళ్ల సమస్యలు పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శివంగారి సతీష్, యువ మోర్చా అధ్యక్షులు రామగిరి అఖిల్, కందుల శ్రీనివాస్, కల్లేపల్లి అంజి, వేణు, కుమార్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.




