Karimnagar: పాత వాళ్లనే పార్టీలో చేర్చుకుని భారీ చేరికలు అనడం హాస్యాస్పదం!
Karimnagar: కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ నిరసనలు, చేరికలపై మండిపడ్డ బిజెపి కార్పొరేటర్ సోమిడి వేణు. పాత వాళ్లనే చేర్చుకుని డ్రామాలు ఆడుతున్నారని తీవ్ర విమర్శలు.
Karimnagar: పాత వాళ్లనే పార్టీలో చేర్చుకుని భారీ చేరికలు అనడం హాస్యాస్పదం!
Karimnagar: కరీంనగర్ బిఆర్ఎస్ లో పనిచేసి అందులో ఉన్నవాళ్లే మళ్ళీ జాయిన్ అయితే భారీగా జాయినింగ్ లు అనడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి కార్పొరేటర్ సోమిడి వేణు అన్నారు. నేడు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నేను ఓపెన్ గా చాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చేరారా మీరు నిరూపించాలన్నారు.
నేను ఆధారాలు తో సహా వస్తాను ఎక్కడికి రమ్మన్నా వస్తానని సవాలు విసిరారు. స్థానికంగా ఓడిపోయిన మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ బిజెపి జంబిగద్దె కు కాషాయం కలర్ వేశారని మాట్లాడడం సిగ్గు మాలిన చర్య అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జంబి గద్దెకు కూడా పింక్ కలర్ వేసి మీరు చేసిన రాజకీయం కాలనీ ప్రజలు గమనించారని అన్నారు.
రెండుసార్లు మేయర్ పీఠం కైవాసం చేసుకున్న మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు అయినా మీకు సిగ్గు రాలేదన్నారు. పట్టణ అధ్యక్షుడిగా చల్ల హరిశంకర్ పూర్తిగా విఫలమయ్యాడని కేవలం రాజకీయ ఉనికి కోసమే నిన్న మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేశారని ఎద్దేవా చేశారు. రెండు స్థానాలలో పోటీ చేసి ఓడిపోయిన హరి శంకర్ పట్టణ అధ్యక్షుడిగా కూడా పనికి రాకుండా పోయాడు.
దసరా బతుకమ్మ వేడుకలకు టెండర్లు జరుగుతే కేవలం రాజకీయ లబ్ధి కోసం టెండర్లు జరగలేదని పనులు చేయడం లేదని మున్సిపల్ పై అబద్ధాలు ప్రసాదం చేయడం మానుకోవాలని సూచించారు. మీ హాయంలో కంటే మా హాయంలోనే నగర అభివృద్ధి జరుగుతుందని గతంలో పార్లమెంటు సభ్యుడుగా ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నిధులు తీసుకొస్తేనే నగర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
మేము నగర అభివృద్ధి కోసం పనులు చేస్తా ఉంటే మీరు పని లేక ప్రెస్ మీట్ లు పెట్టి మీ అక్కకు వెళ్ళగకుతున్నారని మీ ప్రెస్ మీట్లు చూస్తే చాలా నవస్తుందని అన్నారు. మీరు మేయర్గా మీ పార్టీ ఉన్నప్పుడు రాష్ట్రంలో మీ పార్టీ నడుస్తున్నప్పుడు ఎన్ని ఘోరాలు జరిగాయో స్థానికంగా మాజీ కార్పొరేటర్ లను చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
దళిత బంధు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసింది ఇప్పటికి ఆధారాలు ఉన్నాయని బాధితులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. బాధితుల డబ్బులు వాళ్ళకి ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది మేము ఆధారాలతో సహా వస్తాము దయచేసి బాధితులకు ఇప్పించండి అని వేడుకున్నారు.
అభివృద్ధి మాతోనే సాధ్యం మేమే అభివృద్ధి చేసి చూపిస్తాం మీ పదేండ్లో పాలనకు భిన్నంగా పరిపాలన సాగుతుందని ఆది త్వరలో కనిపిస్తుంది అన్నారు. మాటిమాటికి రాజకీయ వ్యభిచారం అనడం సిగ్గుచేటు మీ నాయకుడే టిడిపి నుండి వచ్చాడు. ఇక్కడ ఉన్న రవీందర్ సింగ్ బిజెపి నుండి మీ టిఆర్ఎస్లోకి రాలేదా, మీ పార్టీలో ఉన్న వాళ్లు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లే అది గమనించాలని ఎవరి వీపు వారికి కనిపించదని అందుకే గుర్తు చేస్తున్నట్లు తెలిపారు.
మేము రాజకీయాల కతీతంగా అన్ని డివిజన్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ అన్ని డివిజన్లను సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. రాజకీయాలకతీతంగానే అభివృద్ధి ఉంటుందని ఆ అభివృద్ధి నగర అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
నగర ప్రజలు అన్ని గమనిస్తున్నారని మీకు రాబోవు రోజుల్లో మళ్లీ కర్రు కాల్చి వాత పెట్టడం తప్పదని అన్నారు. రాబోవు ఎన్నికల్లో కరీంనగర్ నుండి బిజెపి ఎమ్మెల్యే గెలుస్తాడని అది తప్పదని ఎందుకంటే ప్రజలు మాపై నమ్మకంతో మాకు అధికారాన్ని అప్పగించారని, అది మేయర్ పీఠమైన ఎమ్మెల్యే పీఠమైన ప్రజలకు న్యాయం చేసేది బిజెపితోనే అని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.




