Sircilla: పుట్టినరోజు వేడుకల్లో సేవాభావం.. రోగులకు పండ్ల పంపిణీ

Sircilla: రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, గంభీరావుపేట ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానంతో మజీద్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Nov 2026 9:53 PM IST
Sircilla
X

Sircilla: పుట్టినరోజు వేడుకల్లో సేవాభావం.. రోగులకు పండ్ల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రక్షణ సేన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మజీద్ పుట్టినరోజు వేడుకలను గురువారం సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, ఫలహారాలు పంపిణీ చేశారు.

అలాగే గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులకే పరిమితం చేయకుండా ఆపన్నులకు అండగా నిలుస్తూ జరుపుకోవాలన్న మజీద్ సూచన మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులు మజీద్‌ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ.. వృద్ధులు, రోగుల ముఖాల్లో కనిపించిన ఆనందం తన పుట్టినరోజు వేడుకలను మరింత సార్థకం చేసిందన్నారు. సమాజంలో ఆదరణకు దూరంగా ఉన్నవారి మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో మనశ్శాంతిని ఇచ్చిందని తెలిపారు. నాయకుడైనా, సామాన్యుడైనా తోటి మనుషులకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని, భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు అల్లే శంకర్, మహిళా నాయకురాలు కదిరే రేణుక, యువ నాయకులు సయ్యద్ జావిద్, బందెల్ల రాజు, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు కదిరే భాస్కర్ గౌడ్, ఉపాధ్యక్షుడు బొమ్మనేని పరశురాములు, ప్రధాన కార్యదర్శి కొడుముంజ బాబు, మండల మహిళా అధ్యక్షురాలు కుల్లేరి మౌనిక, ఉపాధ్యక్షురాలు ఆకారం పుష్పలత, జిల్లా ముఖ్య నాయకులు తోక దేవదాసు, దేవునూరి కవిత, సల్మాల ముత్తవ్వ, బొమ్మనవేణి పద్మ, సాకలి దేవేంద్ర, నారం అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA