Sircilla: సిరిసిల్ల 18వ వార్డులో రూ.6 లక్షలతో డ్రైనేజీ పనులకు భూమిపూజ!

Sircilla: సిరిసిల్ల 18వ వార్డులో ఎంపీ నిధులు రూ.6 లక్షలతో నిర్మించనున్న మురికినీటి కాలువ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 23 Nov 2026 3:54 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల 18వ వార్డులో రూ.6 లక్షలతో డ్రైనేజీ పనులకు భూమిపూజ!

Sircilla: పట్టణంలోని 18వ వార్డులో రూ.6 లక్షల ఎంపీ నిధులతో చేపట్టనున్న సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో రాజ్యసభ సభ్యులు డి. దామోదర్, వద్దిరాజు రవిచందర్ తమ ఎంపీ నిధుల నుంచి సిరిసిల్ల అభివృద్ధి పనులకు దాదాపు రూ.2 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు డి. దామోదర్ నిధుల నుంచి రూ.6 లక్షలతో 18వ వార్డులో మురికినీటి కాలువ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

మురికినీటి పారుదల వ్యవస్థ సరిగా లేక స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి నిధుల మంజూరుకు కృషి చేశారని పేర్కొన్నారు. నిధులు కేటాయించిన రాజ్యసభ సభ్యుడు డి. దామోదర్‌కు, సహకరించిన కేటీఆర్‌కు వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టి సిరిసిల్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆమె వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మెరుగు మంజుల శ్రీనివాస్, ఎర్ర వెంకట రాజ్యం, బొద్దుల శ్రీనివాస్, మామిడాల మహేష్, ఎలుక వెంకటేశం, మొగిలి నాగరాజు, బత్తుల రమేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, గెంట్యాల శ్రీనివాస్, దూడం శ్రీనివాస్, తాజ్, గడ్డం భగవాన్, ఊరకొండ రాజు, మెరుగు శ్రీనివాస్ తదితరులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA