Sircilla: రామన్నపల్లెలో రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవనానికి భూమిపూజ!

Sircilla: తంగళ్లపల్లి మండలం రామన్నపల్లెలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు స్థానిక నాయకులు భూమిపూజ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 1 Nov 2026 7:48 AM IST
Sircilla
X

Sircilla: రామన్నపల్లెలో రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవనానికి భూమిపూజ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగల రాజు, గ్రామ సర్పంచ్ ఆత్మకూరి జ్యోతి అనిల్ భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.

వీబీజీ–రామ్ నిధుల నుంచి రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళా సమైక్య భవనం నిర్మాణంతో మహిళలకు సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించుకునేందుకు సొంత వేదిక అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మందాటి తిరుపతి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉపసర్పంచ్‌లు శ్రీనివాస్, యాస సందీప్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క సురేష్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఎడ్ల తిరుపతి, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA